Home

Write News         Add News Link          Add Event          Write a Blog         Chat         Invite Friends

Telangana Poems

RamMurthy's picture

        Dear all,KCR has been insulted by melodrama in the KarimNagr streets & bunt his effigies. I am not taking it serious or worried about.But I am worried about such a large number of Telangana people attending & performing that provocated programme. These same T-people never did any such programmes or acts when our own T-Congress leaders in the Govt. of AP have been working aginst Telangana interests. In all these 53 years after Telangana has been merged with other regions & formed AP state inumerable /uncountable injustices have been done to our same backword region. After seeing such activities of so many T-people I am worried & some times felt that ,are we trying to get T-state for this kind of people by spending all our energies. I have expressed my feelings in the following poem.  See my agony in poetry form.                  మనకెందుకు స్వాతంత్రం?బానిసలం బానిసలం తెలంగాణ బానిసలంతెలివిలేనిబానిసలం తెగువలేని బానిసలంమనతప్పులె ఎన్నుకుంటుమనలోమనం తన్నుకుంటుపరప్రభువుల పల్లకీలు పరవశంతో మోస్తుందాంపరాయీల పాలనలో యుగాలైన పడిఉందాం మనకెందుకు మంచినీళ్ళు మనకెందుకు తాగునీళ్ళుమనకెందుకు వాగునీళ్ళు మనకెందుకు సాగునీళ్ళుమనకెందుకు మనకెందుకు ఉద్యోగాల్ సద్యోగాల్పరాయీల పాలననే తెగమెచ్చుతు ఉందాముపర ప్రాంతపు ఏలికలకు పాద సేవ చేద్దాము భూములెన్నికాజేసిన నీళ్ళనెన్ని మలుపుకున్నచీమునెత్తురే మనలో లేకుండజేసినాఉలుకలేదు పలుకులేదుమనలో చలనం లేదు కంపెనీలు వస్తయంటే భూములన్నియిచ్చేద్దాంప్రాజెక్టులు కడ్తమంటే పల్లెలు ఖాళీ చేద్దాంపనిలేకుండభోయి బతుకు భారమే అయినాఉన్నఊరునిడిసిపెట్టి ఉరికంబాలెక్కుదాం బానిసలం బానిసలం మనకెందుకు స్వాతంత్రం

mkakulavaram

Post count: 89

నా కలల తెలంగాణ – జూలూరు గౌరీశంకర్

తెలంగాణ మట్టి బిడ్డల
పాదాలకు మొక్కి
వాళ్ళ మనసులో జాగా పొందిన నేతలంతా దన్యులు
డోకా చేయటం తెలియని
మగోసి గుడ్డల అవ్వల అయ్యలు దీవిస్తేనేగా
ఎవరైన జాతి నేతలయ్యేది

మా సదానందంన్నట్లు – దేవేంద్రా –
ఎందరో విప్లవకారుల ప్రాణాలు
గాలిలోకి ఎగరినప్పుడు
నీచేతులకంటిన మరకలను తుడిచేసుకుని
ఆకాల్పులన్ని బూటకమని గొంతువిప్పు
ప్రజాస్వామ్య తెలంగాణ పాట పాడు
ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాశంలో
పాలపిట్టల రెక్కలలార్తు

కేసిఆర్ రాజీనామలన్నప్పుడుల్లా
ఊద్యమ పొత్తిళ్లలోకి రా బిడ్డా అని పిలిచినోణ్ణి
ఇప్పుడు పాలపిట్టరంగు జెండాను నోరారా
పిలుస్తున్నా-

వాకిళ్ల మందు తెలంగాణ ముగ్గేద్దాం
మా పెరళ్లల్లోని స్తానికతను తవ్వి బచ్చలాకు చేసి
ఊదారంగు పందిరేద్దాం
ఈ మట్టిది పోరు అక్షరమాల
మన తల్లులు జన్మనిచ్చి పోరాటం నేర్పిండ్రు
ఉగ్గుపాలల్లో ఆత్మగౌరవాన్ని నూరిపోసిండ్రు
బిగించిన పిడికిళ్ల నిచ్చిండ్రు
మన తండ్రులు కుట్రలు నేర్పలేదు
శత్రువులకు ఆసరా కావొద్దన్నరు
ఫికర్ లేదు –
విడివిడిగా విడిపోయి ఏకమౌదాం-
మన జెండా తెలంగాణ పటం
బావాలు ఎన్ని జెండాలైన కానియ్
మనందరం తెలంగాన చౌరస్తాలో కలుద్దాం
అన్నిదారుల్లోంచి వచ్చి
మహా తెలంగాణ రస్తాలో కలుద్దాం-
ఇప్పుడు నేను ప్రాంతీయ దేశబక్తుల
తయారు చేస్తున్న
ఉద్యమ గణాంకశాకను

నీళ్లు, నిదులు, ఉద్యోగాలు
ముంబయ్, బొగ్గుబాయి, దుబాయ్
ఫ్లోరసిస్‌తో పోరు బూమి వంకర్లు
బిడ్డలను అమ్ముకుంటున్న నా జొన్నరొట్టెలు
అడవిలో నెత్తుటి రంగేసుకున్న చెట్లు
హోలిర హోలీ చెమ్మకేళిర హోలీ
దేవెంద్రా ఇన్నాళ్లు ఎక్కడ పాయె – నీతెలంగాణ పాట

ఇది కెసిఆర్, దేవేంద్రో పాడె పాట కాదు
ఆదిపత్యానికి తలకొరివి ఎవరు పెట్టినా
మన స్వపరిపాలన గేట్లు ఎవరు తెరచినా
ఆత్మగౌరవ నినాదమై ప్రతిద్వనిస్తాం-
నినాదాల నుంచి ఓటర్ల జాతర్ల నుంచి
ఉద్యమబాటకొచ్చేవాళ్లందరికి వాలేకుమ్‌సలామలేకుమ్-
కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో
దేవెందర్ జెండా పట్టుడో
ఇవన్ని మామూలు మాటల తూటాల వ్యూహాలు
తెలంగాణ వచ్చుడే నిజం
దాన్నాపటం ఎవనితరం కాదని చెపుదాం
వచ్చే తెలంగాణ ఎట్లుండాలో
ఇపుడే రాసుకుందాం-
ఈకన్నీళ్ల కొడవళ్లకు సమాదానాలు కావాలె
దొడ్ది కొమురయ్య నెత్తుటికి జవాబుకావాలె
ఐలమ్మల బతుకు మారాలె
వూరుకు వాడకు మద్య బెర్రలు చెరగాలె
ఇంతెందుకన్నా
బహుజన తెలంగాణ యాత్ర మొదలుకావాలె
పౌర హక్కలు గాయపడని నేల
చెట్లకు తుపాకులు పూయని నేల
మన సెరువుల నిండా కలువలు,
తామరులు విచ్చుకనే నేలఆదునిక దొరల పెత్తనాలు లేని అమ్మతనపు నేల
అన్నా అని పిలిస్తే
గుండానిండా ఆత్మగౌరవం ఉప్పోంగే నేల
నేను కలలుకంటున్న తెలంగాణ నేల
అన్నా దేవేంద్రా
మనకు వూరికి
పిడికెడు మంది ప్రకాశం పంతుళ్లున్నరు
గల్లీగల్లీలొ కొమురం బీములున్నరు
ఉద్యమాలకే వన్నెతెచ్చినోళ్ళున్నరు
మనకు సావులు కొత్తకాదు
సమ్మక్క, సారక్కలమై పుడుతూనే ఉంటం-
ఉద్యమానికి జీవం పోసి
నిప్పుల ఉప్పెనలోకి ఒక్క ఉదిటిన దూకిన వాళ్లనే
ఈనేల కౌగలించుకుంటది
వాదాన్ని చీల్చకుండా
దయ్యాల వేదాలు వల్లించకుండా
ఉద్యమ గీతానికి తొలి పల్లవి అవుదాం రా
ఈ మట్టి మీద మీద వొట్టు పెట్టి చెప్పు
దేశానికే ఎర్ర జెండానిచ్చింది ఈనేలేగా
రాగవులూ-
అమ్మతోడు సురవరం నిశాని ఏసిండు
నారాయణ ఎప్పటినుండో అరుస్తనే వుండు
రవ్వంత గోరంత కూసింత
మనసు మార్చుకోవా?
ప్రత్యేకతపై ఆస్తిత్వ సంతకం చేయవా?

మళ్ళి మళ్ళి చెబుతున్న
సరైన సమయానికి సరైన నిర్ణయం దేవేంద్రునిది
కాదంటావా చెప్పు బాబూ!
చెన్నమనేని మొకమాటం లేకండా తెగేసి చెప్పిండు
తమ్ముడు సాగర్ ఎప్పట్నుంచో తనే యిస్తనంటున్నడు
పెద్ద మనిషులు కాకా, పురుషోత్తములు చెప్పినంక
గింతకంటె మంచి సమయమెప్పుడొస్తదే
సెప్పండి..
ఈ మట్టీ మీద పుట్టిన నేతలారా!

జొన్న రొట్టెల మీదొట్టు
బతుకమ్మ మీదొట్టు
సమ్మక్క సారలమ్మ మీదొట్టు
దొడ్డి కొమరయ్య, ఐలమ్మల మీదొట్టు
ఎవరు అడ్డు పడినా తెలంగాణ రాలతప్పదు.

RamMurthy

Post count: 95

 -:గడ్డిపోసలం:-
పైనుంటే కిందుండదు-కిందుంటే పైనుండదు
పూట,పూటకు బతుకు చింత-లేదు ఎన్నడు నిశ్చింత
ఐనా కోలాటాలాడ్తం-బతుకమ్మలు ఆడ్తం
గోశి గొంగడేసుకోని-పాటబాడ్తం,ఆటలాడ్తం
రెండ్రూపాల బియ్యమిస్తె-రెండుసంకలెగరేస్తం
ఆరోగ్యశ్రీ బండిజూస్తె-గుర్తురాదు అనారోగ్యం
ఇళ్ళను కట్టిస్తమంటె-ఉన్న ఇళ్ళు కూల్చుకుంటం
కంపెనీలుబెడ్తమంటె-కొంపలు ఖాళీచేస్తం
ఉద్యోగాలిస్తమంటె-ఊళ్ళకూళ్ళు ఇచ్చేస్తం
గడ్డిపోసలం-మేము తెలంగాణోళ్ళం 

Comment viewing options

Select your preferred way to display the comments and click "Save settings" to activate your changes.

Feedback