Reply to Jaya Prakash Narayan (Lok Satta) from Naveen Achari
Reply to Jaya Prakash Narayan (Lok Satta) from Naveen Achari
అయ్యా'మేధావి ' జయప్రకాశ్ నారాయణ్ గారూ..!!
ఎప్పట్లాగే ఇనాటి ఈనాడు & ఆంధ్ర జ్యోతిలలో మి వార్త చాలా పెద్దగా రాసారు (with photo in front page).
"చాలా దేశాల కన్నా తెలంగాణ విస్తీర్ణం లో పెద్దది. ఇస్తే రాజ్యాంగ బద్దంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వొచ్చు. ఐతే రాజ్య వ్యవస్త మారకుండా రాజధాని మారినంత మాత్రాన అభివృద్ది జరుగదు." అని..
అయ్యా
రేపు తెలంగాణ రాగానే ఇది భూతల స్వర్గం అవుతుంది అని, రాముడే దిగి వచ్చి రాజ్యం చేస్తాడని మేమూ అనట్లేదు. మేమనేది తెలంగాణ వస్తే రెండు రాజధానులే కాదు రెండు రాష్ట్రాలు కూడా ఏర్పడుతాయి. రెండు ప్రభుత్వాలు ఉంటాయి. ఎక్కడి పాలన అక్కడ్నే ఉంటది. దీని వల్ల ఒక ప్రాంతం నిధులు నీళ్లు ఇంకో దిక్కు మళ్ల కుండా ఉంటయి. ఎక్కడి ప్రజల ప్రాధాన్యత లకు అక్కడి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. తమ ప్రాంతం లోని భాషా, సంస్కృతిక వ్యవహారల సం రక్షణ జరుగుతుంది. జవాబుదారితనం పెరుగుతుంది. మికివి తెలుసు అనుకుంటున్నం. వికేంద్రికరణ అని గతం లో గొంతు చించుకున్న మీరే ఇప్పుడు ఎవర్ని అనందింపచేయడనికి ఈ కొత్త పాట మొదలు పెట్టారు.
ఓక చిన్న ఉదాహరణ: బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నదుల నీళ్లను రాష్ట్రాల మద్యే పంచుతారు కాని ప్రాంతాల మద్య కాదు. అంటే తెలంగాణ రానిదే ఆ నీటి విభజన జరుగదు. ఇది మీకు తెలియదా..?
తెలంగాణ భుముల్ని అమ్మి ఆంధ్ర లో ప్రాజెక్టులు కట్టే అధికారం ఈ వలస పాలకుల చేతుల్లోంచి పోవాలంటే తెలంగాణ రావాల్సిందే. ఇలాంటివి ఇంకో వంద సహేతుకమైన కారణాలు మెము ఇప్పటికిప్పుడు చెప్పగలం.
ఇవన్నీ సమైక్య రాష్త్రం లో జరుగుతాయొ లేదో ఈ 50 యేళ్లు మాతో పాటు మీరూ చూసారు. ఇంకో 50 ఏండ్లు ఆగే ఒపిక మాకు లేదు.
తెలంగాణ వచ్చినా పెద్ద లాభం లేదు అనడం మిమ్మల్ని రాజకీయం గా పెంచి పోషించిన రామొజి ఇచ్చిన స్పస్టమైన ఆదేశమా..?
స్వయం పాలన లేనిది ఏ ప్రజల సమూహము తమకు అవసరమైన నిర్ణయాలు తీసుకోలేదు.
రాజ వ్యవస్త ఒక్క రొజు లో మారదు అని మీకు తెలియదా. ఇధి ఒక నిరంత ప్రక్రియ అని మీరెరుగరా. 50 యేళ్లళొ మారనిది ఈ ఏడాది లో మారుతుందా..? అప్పటివరకు తెలంగాణ రావొద్దా..? రాజకీయ నాయకులు ఎక్కడైనా ఇలాగే ఉంటరు. మా నాయకులు మాకేదో చేస్తారని మేమూ అనట్లేదు. మేము తెలంగాణ అడిగేది మీతో పొత్తు వద్దని మాత్రమే. ఉమ్మడి ప్రభుత్వం ముసుగులో ఈ అక్రమాలు ఆగాలంటే తెలంగాణ రావాలి.
అందుకే మా నినాదం తెలంగాణ రాష్ట్రమే కాని ఇప్పుడున్న రాష్ట్రానికి (AP) తెలంగాణ వాణ్ని ముఖ్యమంత్రి ని చెయ్యండి అని కాదు.
భారత స్వతంత్ర పోరాటం లో కూడా దొంగ నాయకులు చాలానే ఉన్నారు. అందుకని రాజకీయ నాయకులు అందరు బుద్దిమంతులు అయ్యేవరకు స్వతంత్రం వద్దన్నారా..?
ప్రజల తెలంగాణ రాష్ట్ర కాంక్షను మీరెప్పుడు అభివృద్ది కోణం లోనే ఎందుకు చూస్తారు.? ఇది స్వయం పాలన నినాదం తో పాటు ఆత్మ గౌరవ పోరాటం అని ఎందుకు మర్చిపోతున్నాౠ..? మీకు తెలియదనుకోవాలా..లేక దానికి సమాదనం లేకనా..?
నిజంగా మామీద మీకంత ప్రేమే ఉంటే రేపు తెలంగాణ వచ్చాక ఇక్కడికొచ్చి మీ బోదనలతో మా నేతల్ని మార్చండి. లేకపోతే మిరిప్పుడు ఒలకబోస్తున్న అవ్యాజ ప్రేమ అర్థం లేనిదనే అనుకోవాల్సి ఉంటుంది. ఇంత చదివీ మళ్లీ అదే ఊబి లో కూరుకుపోయిన మీకు మా సానుభూతిని ప్రకటించాల్సి ఉంటుంది. తెలంగాణ కు సంభందించినంత వరకు మీరంతా ఒకటే అనుకోవాల్సి ఉంటుంది అది సీమ ఫాక్షనిస్టు లైనా ఆంధ్రా 'మేధావులు ' ఐనా..
-naveen achari
| Attachment | Size |
|---|---|
| jp.JPG | 33.69 KB |
|


Post count: 99
Excellent response.
Thanks.
Purushotham
Post count: 467
One point Naveen, the author makes is about the "Bachavat Tribunal Award" wherein once Telangana is made a spearte state, the water distribution will be a state-to-state issue wherin Telangana would benefit.
Purushotham garu, is there some problem with the font not showing up in your browser?
Post count: 99
Naeen garu: Well said. Have you mailed a personal hard copy to him? You know he won't read it in this forum, even though I and people like me appreciate knowing about it. Purushotham
Post count: 454
జయప్రకాశ్ గారు కూడా మహ్మాత్ముడేమీ కారు...ఈయన చెప్తున్న రాజకేయ సూక్తులు స్వయంగా పాటించకపోవడం ప్రజలు గ్రహించాలి. తెలంగాణ ను కేవలం అభివృద్ధి మరియు పదవులతొ ముడిపెట్టె వీరు, ఇలాంటి వారు రాజ్య వ్యవస్థను ఎలా మారుస్తారు ?
- Srinath.M
జై తెలంగాణ !
తెలంగాణ నా జన్మ హక్కు, అభివృద్ధి నా పౌర హక్కు.
Post count: 4
ledhanna pampaledhu. But it should be sent. em chepthado mari dhaniki. aithe ayana full comments niku pamputha. inka sir ku full answer ivvalsi undhi. istha.
Post count: 467
Make sure it reaches him.Our site may not be popular now, but when it does become we can then force them to listen to our side of the story too.
Every effort should be made to make our voices heard.In that regard your effort is appreciated.
Keep up the good work
Post count: 449
హాయ్ నవీన్,
ఇప్పటి తరానికి నువ్వొక గొప్ప ప్రతినిధివి.ఎందుకంటే తెలంగాణ విషయంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో నువ్వు వెలుగులోకి తెస్తున్నావు.నీతిపరునిగా పేరుపొందిన(ఆంధ్ర మీడియాలో)జయప్రకాశ్ గారికి తెలంగాణపై ఉన్న ప్రేమ లోని డొల్లతనాన్ని చాలా బాగా బయట పెట్టావు.జైఆంధ్రా ఉద్యమంలో జేపీ గారి పాత్ర ఏమిటో నువ్వు టీడీఎఫ్‌లో రాసిన విశయం కూడా చదివి నిన్ను ప్రశంసించకుండ ఉండలేక పోతున్నాను.
ప్రముఖ గాంధేయ వాదిగా నిరాడంబరంగా జీవించిన వావిలాల గారు కూడా తెలంగాణ విషయం వచ్చేవరకు పక్షపాతాన్ని ప్రదర్శించేవారట.అట్లాంటి వాళ్ళందరిని చూసే మొదట సమైక్య వాదిగా ఉండిన కాళోజీగారు తరువాత కాలంలో వేర్పాటువాదిగా మారినారట.
ఐతే తెలంగాణకు ఎంత వ్యతిరేకి ఐనా టీడీపీ మహిళా అద్యక్షురాలి,జేపీగారి మద్య,అవినీతి వ్యతిరేకోద్యమానికి మన తెలంగాణ వాదులమంతా మద్దతు తెలపాల్సి ఉంది.ముందుగా వారి ఉద్యమాన్ని మన తెలంగాణలోనే నిర్వహించాల్సిందిగా మనం ఆహ్వానిస్తేకూడా మంచిదే.పై సమస్యలపై ఉద్యమం చెయ్యడానికి వారికి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లివ్వాల్సిన పని లేదని మాత్రం మన తెలంగాణ వాళ్ళకు స్పష్టంగా తెలియజెప్పాలి.
Post count: 449
మీరు ఇంకో మాట కూడా అన్నారు. "కులం, మతం, ప్రాంతం వీటికి రాజకీయంలో కొంత పాత్ర తప్పదు. కాని కేవలం వాటి చుట్టూనే రాజకీయాన్ని తిప్పడం సమాజానికి అనర్థదాయకం అని, కేవలం రాజధానులు మారినంత మాత్రాన ప్రయోజనం లేదు అని ఇందుకు ప్రతి జిల్లాకు స్వయం ప్రతిపత్తి కల ప్రభుత్వం ఉండడం అవసరమని, ఇదే లోక్ సత్తా విధానం"అని ప్రకటించారు.
మీరు తెలంగాణ ను ప్రాంతీయవాదం అన్నరు. దీన్ని కులం, మతం ల సరసన చేర్చారు. అధికార వికేంద్రీకరనను, ప్రజల స్వయంపాలన అభిలాషను కులం, మతం వంటివి అనడాన్ని మీ విగ్నతకే వదిలేస్తున్నం. ఇక జిల్లాలకే అధికారాలు అన్నరు. జిల్లా స్థాయి ప్రభుత్వాలకు తెలంగాణ ఎలా అడ్డుతగులుతుందో మీరే చెప్పాలి. తెలంగాణ వచ్చాక జిల్లాలకు అధికారాల బదలాయింపు అసాధ్యం కాదుకదా. మీపోరాటన్ని అప్పుడూ కొనసాగించవచ్చుకదా. ఇందుకు ప్రజాస్వామికవాదులుగా మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. అప్పుడు ఇంతబలమైన రాస్ట్ర ప్రభుత్వం ఉండదు కాబట్టి స్థానిక సంస్థలు అవసరమైన అధికారాలను సాధించుకోవడం సులువు కూడా.
అయ్యా, తెలంగాణ చుట్టూ రాజకీయం తిరగాల్సిన అవసరం ఎంధుకు వచ్చిందో మీకు తెలియనిది కాదు. ప్రజల అకాంక్షలకు భిన్నంగా, ఫజుల్ అలీ కమిటి సిఫార్సులను కాదని ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. 50 యేండ్ల తర్వాత కూడా ప్రజలు తెలంగాణ అకాంక్షను బలంగా వినిపిస్తున్నారు. ఇది తప్పెలా అవుతుంది. ప్రజల అభిష్టాన్ని మించిన రాజకీయం ఎముండగలదు. వందలాది మంది విద్యార్తుల్ని చంపి మరీ ఇక్కడ అధికారం లో తిష్టవేసిన సాటి తెలుగు సోదరుల ప్రయోజనాల్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించకుండా డిల్లీలోని ధ్రుతరాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఎక్కడ తమ దోపిడికి ఆటంకాలేర్పడతాయోనని కొన్ని శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయి. ఆసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ఇంత జాప్యం ఎందుకు అని మీరు ఈ తోలు మందం ప్రభుత్వాల్ని ప్రశ్నించి ఉంటే మీరు ప్రజలవెంటే ఉన్నరనుకునే వాళ్లం. కానీ మేధావులం అని చెప్పుకునేవాళ్లు 'ప్రజస్వామ్యం' అనె పదం తమ పేటెంట్ గ భావించేవారు ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవాల్సిందిపోయి దోపిడివర్గాల కొమ్ముకాయడం, తెలంగాణ వనరుల్ని స్వాహా చేసిన లాబీలకు అండగా నిలవడాన్ని పునరాలోచించుకోవాలి. ప్రజలే ప్రభువులు అని చెప్పే మీవంటి 'నూతన ' ప్రజస్వామిక వాదులు తెలంగాణ వారూ ప్రజలే అని గుర్తించడం అత్యంతావశ్యకం.
జిల్లా స్థాయిలో వనరుల పంపిణి (ప్రధానంగా నదీ జలాలు) అనేది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏనాడొ చెప్పారు. ఎవరు అధికారం లో ఉంటే వారి పక్కనచేరే కమ్యునిస్ట్ లు కూడా దాన్ని అమలు చేయించలేకపోయారు. కారణం తెలియంది కాదు. ఇక మీరు చెప్పే జిల్లా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల దయా దక్షిన్యాల మీద అధారపడి ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వాలు స్థానిక సంస్థల అధికారాలను ఒక్కొక్కటి ఊడగొట్టి నిర్జీవంగా తయారుచేసాయి. ఇప్పుడు వాటికి ఆ అధికారాలు ఇచ్చినా వాటిని కొనసాగిస్తారనే గ్యారంటీ లేదు. దీనితో పోలిస్తే తెలంగాణ ఎర్పాటు వనరుల, అధికారాల విభజనకు సులభమైన, సమర్థవంతమైన పరిష్కారం కాగలదు. అప్పుడు అవసరం అనిపిస్తే జిల్ల & గ్రామ స్థాయి లో నిర్ణయ అధికారాం కోసం మీరు పోరాడవచ్చు. మీరెందుకు ఆ దిశగా అలోచించరు.
-నవీన్ ఆచారి
తెలంగాణ ఐటి ఫోరం
Post count: 449
Naveen, JP's comparison of Telangana with Kulam and matham is comepletely un warrented.This is a deliberate attemp by him to degrade the movement.
I believe we should be careful with people like JP who are starting to eat away into Telangana base by their pseudo intellectualism.
Please should be reminded about his involvemnt in Jai Andhra movement.
Post count: 449
jp garu.
yenthakaalam--sir--maaku yi banisa brathukulu???
yenthkaalam sir----swantatram leni jeevethaalu ? ? ?
yenthakalam sir--boo dopidi--nella dopidi ???
yekkadaundhi sir--neethi--nijayith--nyaam ??? baabu lona--c.m loona--mega star lo naa ???
valla atalu--arupulu --yaatralu anni
c.m padhvi kosam kaadaa sir ???/
jp-- garu
mee matalu okatiru
mee chetalu -- marioka tiru
meeru peruku matramei jp--nijamyina jp garu--nehru gari kalam lo
janata party ni spanchi prayatham chese visigi yi vyasthanu marcha leka
mana nundi vellipoyaadu
that jp and this jp is different
meeru ah jp karu
padhvi kosam--peru kosam aduthunna naidu , meeru okatai
look 50 yrs-- how much we suffered
yendhuku sir leni poni koothalu
sattha leni loka sattha leader garu
buchi reddy
9495108590
Post count: 7
DEAR FRIEND
U HAVE GIVEN A CONCISE AND BEFITTING REPLY TO SO CALLED MEDHAVI. hE WENT to delhi and told PM that by art 371 etc , telangana problem will be solved.He tried to misguide thinking that we do not read history. so called amendment was already made to protect telangana interested but ANDHRA leaders have violated them with immunity. when andhra are selfish, cunning and do not have the concern and heart to bring up their poor telangana brother , no constitutional amendment can work. when 90 % of implementing machinary is andhra and chief minister is seemandhra and coupled with money power, our telangana leaders could not do anything and cannot do also. there is no point in staying with them anylonger.even in a joint family,if elder brother insults younger one , does not give due recognition in all walks of life and loots his sweat, he will revolt after some time.the sweet talk cannot last eternally.andhraites wants united andhra but do not want make sacrifices required for it even now. A look at DISHA DASHA programmein hmtv clearly exposes the selfish attitude of andhrites.they talk of their area development and are least bothered about telangana becausae they never had any emotional attatchment with telangana people except for exploiting their resources and surplus funds. when we want to separate, they are opposing clearly indicating that they lose something by separation and thst is their exploitation of telangana water, jobs,educational seats, awards by govt, illegalland at hyderabad,fall of land prices, grants cannot be diverted etc.
we telangana people have lately realised the injustice done to our area.no force can stop telangana if we are all united and do not fall prey to andhra sweet talk, money and other allurements etc.
cvr
freedomfighter