Home

Write News         Add News Link          Add Event          Write a Blog         Chat         Invite Friends

మేలుకో ! ఏలుకో !!

Admin's picture
Admin

మేలుకో ! ఏలుకో !!

Author(s) : Musku Ramu -Dubai
Published On : June 17th, 2008 Updated at : June 18th, 2008
Tags :

మేలుకో ! ఎలుకో !!

ఓ తెలంగాణా ముద్దు బిడ్డ మేలుకో !
నీ రాష్ట్రాన్ని నీవు ఎలుకో !!

పోరాటలకు ఉపిరి గడ్డ
ఓ తెలంగాణా ముద్దు బిడ్డ

పాలకుల దోపిడీకి ఎదురొడ్డి పోరాడు
నీ ఓటు అనే తూటా తో పోటు పోడు

బాంచెను  కాల్మొక్త అనే బతుకు నుండి విముక్తి కొరకు
ప్రాణ సమాన మైన తెలంగాణా యాస కొరకు,
గల గల పారే కృష్ణమ్మ నీటి కొరకు,
ఉవ్వెథున ఎగిసే గోదావరి తల్లి జోరు కొరకు,
బతుకమ్మ బతుకు కొరకు,హొలీ రంగుల ఖెళీ కొరకు,
కమ్మ నైనా తెలంగాణా మట్టి కొరకు,
ఆఖరి లోల్ళీ లో విజయం కొరకు,
తెలంగాణా వాదం కొరకు,

మేలుకో ఓ తెలంగాణా ముద్దు బిడ్డ మేలుకో !
ఎలుకో నీ రాష్ట్రాన్ని నీవు ఎలుకో !!

పచ్చని పల్లెల తెలంగాణా కొరకు,
ఆలై బలై రాష్ట్రం కొరకు,చరిత్ర లో నిలిచి పోయే తెలంగాణా కొరకు,
ప్రత్యేక తెలంగాణా పోరు లో అమరులైన వీరుల ఆత్మ శాంతి కొరకు,

రాళ్ళ తో రజాకార్లను తరిమికొట్టిన స్పూర్తి తో,
తెలంగాణా సోయి తో ఆంధ్ర పాలకుల
రొమ్ము విరిచి తెలంగాణా అడిగిన ఫనికర మల్లన్న ఆదర్శం తో,
రాజ్యాంగం చూపిన దారిలో, ప్రజాస్వామ్య పద్దతి లో,

"ఓటు"అనే ఆయుధం తో, పాలకుల మెడలు వంఛుట కొరకు,
తెలంగాణా తల్లిని ప్రతిబింబించుట కొరకు,

ఓ తెలంగాణా ముద్దు బిడ్డ మేలుకో !
ఎలుకో నీ రాష్ట్రాన్ని నీవు ఎలుకో !!

జై తెలంగాణా !                                    జై జై తెలంగాణా !!
ఓ తెలంగాణా పోరగాడు, దుబాయి

RamMurthy

Post count: 161

 
"సమైకాంధ్రవాదులు శాంతికపోతాలా?"
 
ఏయ్‌ర తెలంగాణా దెబ్బెయ్‌ర తెలంగాణా
సైరతెలంగాణా హైహైర తెలంగాణా 
మస్కట్ల ఉన్నోళ్ళంతా మన తెలాంగాణోళ్ళేరా
దుబైల ఉన్నోళ్ళంతా మనతెలంగాణోళ్ళేరా
అమెరికాలఒ ఉండ్రు, ఆస్ట్రేలియాలో ఉండ్రు
అంద్రాల ఎందుకులేరో చెప్పాలె ఆంధ్రవాడా.(ఎయ్‌ర)
 
బడిపిల్లలు కదిలిండ్రు,మీపప్పులుడకవండ్రు
రచయితలు కదిలిండ్రు,మీతప్పులెదుకుతుండ్రు
కులాలు కదిలినాయి,కలాలు కదిలినాయి,
కూలినాలి గదిలినారు,కార్మికులు కదిలినారు,
రైతన్నలంత లేశి-నేతన్నలంత కలిసి
చేరినారు అంతా ఇప్పుడు తెలంగాణచెంత 
మహిళాలు కోరుతుండ్రు,ముస్లిములు పోరుతుండ్రు
మేధావులంతగూడి మతలబులు చెప్పుతుండ్రు
తెలంగాణ వచ్చువరకు తెగించిపోర్తమండ్రు(ఎయ్‌ర)
జగడపాటిగాడు మననేమిజెయ్యలేడు,
చంద్రబాబుకూడా  ఇకనోరుతెరువలేడు,
పందికొక్కులాగా ఆగాదెపండుకుండు,
జైఆంద్ర జోగయ్య ఐనాడుసమైక్యయ్య    
ధర్మానగాడు వీడు ధర్మామెతెలియనోడు
రాయపాటి-కావూరులు హిల్సు కబ్జజేశినోళ్ళు
రాబందులంత గలిసి చేయించినారు బందు (ఎయ్‌ర)
తెలంగాణ ఇస్తమని తమిళోడు చెప్పరాదా?
తెలుగు గంగ నీళ్ళు తమిళోనికాపుతారా?
మీకుడబ్బగొట్టినప్పుడె తమిలోళ్ళు మంచివారా?
న్యాయంగ జెప్పినోళ్ళు చెడ్డోళ్ళూ అయ్యినారా?
వేర్పాటువాదులంతా కరడుగట్టినోళ్ళా?
సమైక్యవాదులంతా శాంతికపోతాలా?

Comment viewing options

Select your preferred way to display the comments and click "Save settings" to activate your changes.

Feedback